Header Banner

ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తారు.. మేము కాదు! వైకాపాపై సీఎం చంద్రబాబు సెటైర్లు!

  Tue Feb 25, 2025 18:33        Politics

వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే బయటకు తెస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో సీఎం మాట్లాడారు. “ వైకాపా హయాంలో జరిగిన సభ కౌరవ సభ. కౌరవసభను గౌరవసభ చేశాకే అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేశా. గౌరవసభను అవమానించే పార్టీ ఇవాళ అసెంబ్లీలో లేకుండా పోయింది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననడం ఎప్పుడూ చూడలేదు. సంప్రదాయాలను మరిచి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనడం సమంజసమా? ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది మేం కాదు.. ప్రజలు. నిన్న వైకాపా నేతలు కేవలం 11 నిమిషాలే సభలో ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తాం. రూ.200 ఉన్న పింఛన్ను రూ. 2వేలు ఆ తర్వాత రూ.4వేలు చేశాం. దివ్యాంగుల పింఛన్ రూ.6వేలకు పెంచాం. మంచానికే పరిమితమైన వారికి రూ.15వేలు పింఛన్ ఇస్తున్నాం. పింఛన్ల రూపంలో ఏటా రూ.34వేల కోట్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ. స్వార్థ ప్రయోజనాల కోసం మేం కలిసి పోటీ చేయలేదు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనే లక్ష్యంతోనే కలిసి పోటీ చేశాం. వైకాపా పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమైంది. డబుల్ ఇంజిన్ సర్కార్ లేకుంటే రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయలేమని భావించాం. రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తున్న కేంద్రానికి ధన్యవాదాలు"


ఇది కూడా చదవండి: భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చిన కెనడా.. వారికి వీసా రద్దు చేసే అవకాశం! ఈ కొత్త నిబంధనలతో..


అందరూ గర్వపడేలా రాజధాని నిర్మిస్తాం..
“త్వరలో రైతు భరోసా అమలు చేస్తాం. రైతు భరోసా కింద కేంద్రం, రాష్ట్రం కలిసి రూ.20వేలు ఇస్తాం. మత్స్యకారులకు ఇచ్చిన హామీ మేరకురూ.20వేలు అందిస్తాం. ఇచ్చిన హామీ మేరకు 16,384 టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం. మే నెలలో తల్లికి వందనం పథకం అమలు చేస్తాం. ఎంత మంది పిల్లలున్నా అందరికీ అమలు చేస్తాం. కేంద్ర పథకాలకు ఇచ్చిన గ్రాంట్ను కూడా గత ప్రభుత్వం వాడేసింది. జల్దావన్ కోసం రూ.80వేల కోట్లు కావాల్సి ఉంటే.. గత ప్రభుత్వం కేవలం రూ.20వేల కోట్లు అడిగింది. అందరూ గర్వపడేలా రాజధాని నిర్మిస్తాం” "గత ప్రభుత్వంలో రంగుల పిచ్చి ఎక్కువయ్యింది.. సర్వే రాళ్లపైనా బొమ్మలు వేసుకున్నారు. పేదరికం లేని సమాజాన్ని తయారు చేయడమే మా లక్ష్యం. ఇళ్లు లేని పేదలకు ఐదేళ్లలో ఇళ్లు నిర్మిస్తాం. గ్రామీణ పేదలకు 3 సెంట్ల ఇంటి స్థలం ఇస్తాం. ఉగాది రోజున పీ-4 విధానాన్ని ఆవిష్కరిస్తాం. 20లక్షల ఉద్యోగాల కల్పన మా ప్రభుత్వ బాధ్యత. రూ.6.50లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ పూర్తి చేశాం. తాజా పెట్టుబడుల ద్వారా 5లక్షల ఉద్యోగాలు వస్తాయి. నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు భృతి ఇస్తాం” అని సీఎం ప్రకటించారు.

ఇది కూడా చదవండి: జీవీ రెడ్డి రాజీనామా వెనక ఉన్న అసలు కారణం ఇదే! ఎవరు నిజంఎవరు తప్పు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వంశీ కి దిమ్మతిరిగే షాక్.. మళ్లీ మరో కేసు నమోదు! ఇక పర్మినెంట్ గా జైల్లోనే.? మరో 15 మందిపై..

 

హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్‌ చెక్‌ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్‌ అయ్యాయో తెలుసా?

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలుమార్గదర్శకాలు ఇవే!

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలుమార్గదర్శకాలు ఇవే!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #APCM #CBN #todaynews #flashnews #latestupdate